Simran : సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఓ వివాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. గతంలో ఓ ఈవెంట్ లో సిమ్రాన్ మాట్లాడుతూ ‘నేను ఓ సినిమా చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఓ నటి పాత్రను ప్రశంసిస్తూ నేను ఓ నోట్ రాశాను. దానికి ఆమె ఇచ్చిన రిప్లైతో నిజంగా షాక్ అయ్యాను. ఆమె ఆంటీ రోల్స్ చేయడం కన్నా ఇలాంటి డబ్బా రోల్స్ చేయడమే బెటర్ అంటూ రిప్లై ఇచ్చింది. అది చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. అయినా అలాంటి డబ్బా రోల్స్ చేయడం కంటే గౌరవంగా ఆంటీ రోల్స్ చేయడంలో తప్పులేదు’ అంటూ సిమ్రాన్ మాట్లాడింది.
Read Also : Jyoti Malhotra: ‘‘గూఢచారి’’ జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసి పాక్ ట్రావెల్ సంస్థ
ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. డబ్బా కార్టెల్ సిరీస్ లో చేసిన నటిని ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేసిందంటూ రూమర్లు వచ్చాయి. ఈ వివాదంపై తాజాగా సిమ్రాన్ స్పందించింది. నేను మాట్లాడింది చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ నటిని నేను ప్రశంసించాను. కానీ ఆమె సరిగా అర్థం చేసుకోలేదు. తర్వాత నాకు సారీ కూడా చెప్పింది. నిజంగా ఆమె నటన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది సిమ్రాన్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?