JR NTR : తమిళ స్టార్ హీరో శింబు హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ సామ్రాజ్యం. ఈ మూవీ ప్రోమోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రోమో క్షణాల్లోనే వైరల్ అవుతోంది. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మీద శింబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. మీడియాతో హీరో మాట్లాడుతుంటాడు. నా కథను ఎన్టీఆర్ తో చేయించండి. అతను అయితే పర్ఫార్మెన్స్ కుమ్మేస్తాడు’ అంటూ చెప్పాడు.
Read Also : Kantara Chapter 1 : కాంతార-1 బీభత్సం.. ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందంటే..?
ఈ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. వడ చెన్నై యూనివర్స్ లోనే ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు కాబట్టే ఇందులో ఆయన పేరును పెట్టినట్టు తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య ఇతర భాషల సినిమాలను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్న కాంతార చాప్టర్ 1, నేడు ఈ సినిమాను ఎంకరేజ్ చేస్తున్నాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ గొప్ప మనసున్నోడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Dulkar Salman : దుల్కర్ సల్మాన్ కు భారీ ఊరట
