Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసుకదా సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా తన ఫ్యాన్స్ చాట్ చేశాడు. ఇందులో చాలా విషయాలపై స్పందించాడు సిద్దు. ఇందులో భాగంగానే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. తనకు రణ్ బీర్ కపూర్ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో తెలుగులో మీకు ఎవరూ ఫేవరెట్ హీరోలు లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ మూసేయండి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
తెలుగు హీరోలు ఇంత మంది స్టార్లను పెట్టుకుని బాలీవుడ్ హీరోను ఫేవరెట్ అని చెప్పడం ఏంటని మండిపడుతున్నారు. సిద్దు జొన్నలగడ్డను సపోర్ట్ చేసింది మన తెలుగు హీరోలే కదా.. ఆయనకు చాలా మంది హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు బాలీవుడ్ హీరోలో అంతగా ఏం నచ్చిందని అంటున్నారు. మొత్తానికి సిద్దు ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దారి తీసింది. రీసెంట్ గా వరుస ప్లాపులతో బాధపడుతున్న ఆయన.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Read Also : Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
