Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత సిద్దుకు మంచి ఛాన్స్ లు వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు. ఈ సినిమా సిద్దు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం తరువాత సిద్దు ..టిల్లు స్క్వేర్ అంటూ సీక్వెల్ ప్రకటించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. అయితే సిద్దు.. డీజే టిల్లు తరువాత సెకండ్ హీరోగా కానీ, కీలక పాత్రలో కానీ చేయడం మానేశాడు. ఇప్పటికే బుట్టబొమ్మ సినిమాలో సెకండ్ హీరోగా చేయాల్సి ఉండగా.. దాని నుంచి బయటికి వచ్చి అప్పట్లో చాలా వివాదాలనే కొనితెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవితో చేసే ఛాన్స్ ను కూడా వదులుకున్నాడని టాక్ నడుస్తోంది.
Baby: సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది- వైష్ణవీ చైతన్య
ప్రస్తుతం చిరంజీవి.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. మలయాళంలో భారీ హిట్ అందుకున్న బ్రో డాడీకి ఇది రీమేక్ అని సమాచారం. ఇందులో చిరుకు కొడుకుగా సిద్దు నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సిద్దు రిజెక్ట్ చేసాడట. టిల్లు స్క్వేర్ షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడం, డేట్స్ అడ్జెస్ట్ లేకపోవడంతో సిద్దు ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో మేకర్స్ మరో కొత్త హీరోకోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. అయితే.. ఈ వార్త తెలియడంతో అభిమానులు.. ఏంటీ .. చిరుతో చేసే అవకాశాన్ని సిద్దు వదులుకున్నాడా.. ? ఎంతమంది ఆయనతో సినిమాచేయాలనీ చూస్తుంటారు.. టిల్లు హిట్ అవ్వడంతో సిద్ధుకు కొంచెం గర్వం ఎక్కువ అయ్యిందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఏంటి అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.