Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Baby Movie Heroine Is Confident About Movie Result

Baby: సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది- వైష్ణవీ చైతన్య

Published Date :July 11, 2023 , 5:01 pm
By Shiva Kranthi
Baby: సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది- వైష్ణవీ చైతన్య
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలేంటంటే..

నా పేరు వైష్ణవీ చైతన్య. యూట్యూబర్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గా కొందరికి తెలుసు. బేబీ అనేది హీరోయిన్‌గా నా మొదటి సినిమా. సాయి రాజేష్ గారు నాకు హీరోయిన్‌గా అవకాశాన్ని ఇచ్చారు.

Also Read

  • Back-to-Back Surprises : ఎన్టీఆర్ - చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
  • JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
  • RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
  • Tollywood : సమ్మర్‌ అంటే భయపడిపోతున్న స్టార్స్‌
Add as a preferred
source on google

హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ పాత్ర వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కథ విని షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందని అనుకున్నాను. ఈ పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నా జీవితానికి ఇది చాలా గొప్ప, పెద్ద అవకాశం.

ప్రతీ యాక్టర్‌ అంతిమ లక్ష్యం సినిమానే. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నా చుట్టూ వాళ్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నా మీద చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు.

బేబీ సినిమాలో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు.

సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇది మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. ఇది ఎంతో సున్నితమైన పాత్ర.

బస్తీ నుంచి కాలేజ్‌కి వచ్చిన అమ్మాయి ఎలా మారిపోయిందని చెప్పేందుకు ఈ కలర్‌ను ఓ మీటర్‌లా తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ అనే మీటర్‌లో చూపించలేదు. ఆ అమ్మాయి మీద ఏ విషయాలు ప్రభావితం చూపించాయి.. ఎలా మారిపోయింది? అనే కోణంలోనే చూపించాం.

బేబీ సినిమాకు సైన్ చేసి మూడేళ్లు అవుతుంది. చాలా డెప్త్ ఉన్న సీన్లు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ ప్రెజర్ అని ఫీల్ అవ్వలేదు. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి ఈ పాత్రను చేశాను. అమ్మాయి కోణంలోంచి ఈ కథ నడుస్తుంటుంది.

షూటింగ్‌ కోసం సెట్‌లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ టేక్ చెప్పేసరికి మేం ముగ్గురం చర్చించుకుని రెడీగా ఉండేవాళ్లం. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్‌లో ఉన్న సీన్‌లే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి.

తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మధురానుభూతిలా మిగిలిపోతుంది. ఈ సినిమాతోనూ అదే చెప్పబోతోన్నాం. విజయ్ బుల్గానిన్ గారితో మనసే మేఘం అనే ఓ ప్రైవేట్ ఆల్బంలో చేశాను. ఇప్పుడు బేబీ సినిమాను చేశాను. ఈ సినిమాకు ఆయన బెస్ట్ గిఫ్ట్.

ఇప్పటి వరకు నేను ఏ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. నా ఫోకస్ మొత్తం బేబీ మీదే ఉంది. ఈ సినిమా వచ్చాక రెస్పాన్స్ చూడాలి. నేను ఏం చేయగలనో కూడా అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా నేను కష్టాలు పడ్డాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. సినిమాల మీదే ధ్యాస ఉండేది. ప్రతీ ఫీల్డ్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడు నేను బేబీ సినిమాతో విజయం సాధించినట్టు అనిపిస్తుంది.

తెలుగు అమ్మాయిలకు చాన్స్‌లు ఇవ్వరనే మాట, ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలీదు. అలా ఏం ఉండదు. మన వంత ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను. బేబీ సినిమాకు ఎస్‌కేఎన్ పర్ఫెక్ట్ నిర్మాత. సాయి రాజేష్ గారిని నమ్మారు. ఈ మూడేళ్లలో ఆయనకు కూడా ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి. కానీ బేబీ సినిమాకు అండగా నిలబడ్డాడు. కంటెంట్, కథన నమ్మారు. ఫ్రెండ్ షిప్ కోసం నిలబడ్డారు. సాయి రాజేష్ గారి మీద ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • baby
  • Baby Release Date
  • Baby Review
  • Baby Songs
  • Vaishnavi Chaitanya

తాజావార్తలు

  • Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?

  • Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా

  • Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?

  • JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions