Shyam Singha Roy:న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. గతేడాది క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొంది. ఇక తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. మూడు విభాగాల్లో ఈ సినిమాను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.. కల్చరల్ క్లాసిక్ డాన్స్, పీరియాడిక్ ఫిల్మ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి మూడు విభాగాల్లో ఈ సినిమా ఎంపిక అయ్యిందని సమాచారం.
ఇక దీంతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ మూడు విభాగాల్లోఏదో ఒక విభాగానికైనా అవార్డు వచ్చిందా.. టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇకపోతే ప్రస్తుతం నాని దసరా సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో న్యాచురల్ స్టార్ నాని అభిమానులు అవార్డు రావాలని కోరుకొంటున్నారు. ఇక ఇటీవలే ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ నిలిచినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ లో నటనకు గాను ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఉన్నాయని అమెరికా వెబ్ సైట్ రాసుకొచ్చింది. ఏదిఏమైనా తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ స్థాయికి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.