టాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాహుల్ సాంకృత్యాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అదనుకోవడంతో నాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ నేడు విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. శ్యామ్ సింగరాయ్ .. ఒక సాధారణ బెంగాలీ యువకుడు.. ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది కథ.. ఈ కథ నాని కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ సూట్ అవుతుందని, ఒరిజినల్ గా నాయకుడిగా పవన్ ఎలా ఉన్నాడు అనేది శ్యామ్ సింగరాయ్ అలాగే ఉందని పవన్ ఫాన్స్ అబిప్రాయపడుతున్నారు.
ఇక ఇదే విషయాన్నీ రాహుల్ వద్ద ప్రస్తావిస్తే.. ఆయన చెప్పిన మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. ” పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం .. ఆయనను డైరెక్ట్ చేయాలనీ నాకు ఉంది.. ఆయన ఒప్పుకొంటే శ్యామ్ సింగరాయ్ 2 పవన్ తోనే తీస్తా” అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఒక పవర్ ఫుల్ కథ .. పవన్ కనుక చేస్తే పవన్ ఫ్యాన్స్ రచ్చ మూమూలుగా ఉండదు అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ వార్త పవన్ వరకు వెళ్లి ఆయన రాహుల్ కి ఓకే చెప్తాడా ..? అనేది తెలియాల్సి ఉంది.