సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. తాజాగా సోషల్ మీడియాలో ఈ బీయూటీకి ఒక వెరైటీ ప్రశ్న ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది శృతి. ఇందులో భాగంగా అభిమానులు ఆమెను వివిధ ప్రశాలు అడగ్గా, శృతి కూడా వాటికి సమాధానం ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ మాత్రం ‘మీ లిప్ సైజు ఏంటి?” అని ప్రశ్నించాడు. దీనికి శృతి హాసన్ చాలా క్లాస్ గా స్పందించింది. “అవునా.. లిప్ సైజు కూడా ఉంటుందా?” అంటూ తిరిగి ప్రశ్నించింది. దీంతో వెంటనే ఆ నెటిజన్ క్విట్ అయిపోయాడు. శృతి హాసన్ ఇలాంటి విషయాలను చాలా తేలికగా తీసుకుంటూ ఉంటుంది. అలాగే తనను ట్రోల్ చేసే వారికి కూడా అంతే కూల్ గా సమాధానం చెబుతుంది.
Read Also : KGF Chapter 2 : రాఖీ భాయ్ వయోలెన్స్… హీరోల వెనకడుగు !
ఇంతకుముందు బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నట్టు శృతి హాసన్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ పలు చిత్రాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “సలార్”లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది శృతి హాసన్. మరోవైపు బాలయ్య, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మూవీలో కూడా కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.