శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్ర కథానాయకుడు శివ కందుకూరి, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూడగా, నటి శ్రియా శరన్ కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ లో చూసింది. విశేషం ఏమంటే… ఓ సాధారణ మహిళ తరహాలో శ్రియా ఆటోలో థియేటర్ కు వచ్చి, కామన్ పబ్లిక్ తో పాటుగా ‘గమనం’ మూవీని వీక్షించింది. ఆలోచనాత్మకమైన ‘గమనం’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.