‘పుష్ప’ బాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ పేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ‘పుష్ప’ మాయలో పడిపోయారు. అయితే హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ వాయిస్‌కి హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పాడని చాలా మందికి తెలియదు. ఆయన వాయిస్ కి స్పందన అద్భుతంగా ఉంది. శ్రేయాస్ మరోమారు ఈ సినిమాతో లైమ్‌లైట్ లోకి వచ్చాడు.
Read Also : వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !!
అయితే తాజాగా అల్లు అర్జున్ ను కలిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారని ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ ను అడిగారు. శ్రేయాస్ వెంటనే “నేను బన్నీకి పెద్ద కౌగిలింత, ముద్దు ఇస్తాను. ‘పుష్ప’కు ధన్యవాదాలు” అని చెప్పాడు. OTTలో విడుదలైన తర్వాత కూడా ‘పుష్ప’ దేశవ్యాప్తంగా అనేక థియేటర్లలో ఆడుతోంది. ఉత్తరాదిన మాత్రం ఇంకా ‘పుష్ప’ ఫీవర్ నడుస్తోంది.