Shraddha Das: టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అర్ధం. అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఈవెంట్ లో పాల్గొన్న శ్రద్దాదాస్ మాట్లాడుతూ “ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు విఎఫ్ఎక్స్ ఇంపార్టెంట్. డీవోపీ పవన్ నన్ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మణికాంత్, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ మూవీలో గ్లామర్ రోల్ లో సైకియాట్రిస్ట్ గా నటించాను. ఇందులోని నా పాత్ర స్పెషల్ గా ఉంటుంది.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలోనటించడం చాలా హ్యాపీ గా ఉందని” చెప్పుకొచ్చింది.
ఇక ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ ” కొంతమంది నిర్మాతలు మంచి కాన్సెప్ట్ సినిమాలు సెలక్ట్ చేసుకొని తీసిన చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ కి మంచి పేరు తెస్తాయి. అలాంటి మంచి కాన్సెప్ట్ చిత్రాలు నిర్మించే నిర్మాత శ్రీనివాస్ గారని నమ్ముతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆకట్టుకొంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శ్రద్ధా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=YCkvj3xGAGA