టాలీవుడ్ సీనియర్ హీరో, యనఁగ్రో యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఇప్పుడు కుటుంబంతో కలిసి అందమైన అరకు లోయల్లో ఆహ్లాదకరంగా గడుపుతున్నారు. ఆ అందమైన పప్రాంతంలో సేదతీరుతున్న రాజశేఖర్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కూతురు శివాత్మికతో కలిసి కన్పిస్తున్నారు రాజశేఖర్. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ అరకు అందాలను చూస్తూ గడిపేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అరకులో సందడి చేయడానికి కారణం రాజశేఖర్ సినిమా “శేఖర్”.
Read Also : ఆగష్టు 15న “రాజ రాజ చోర” ప్రీ రిలీజ్ ఈవెంట్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. సుమారు 20 రోజుల పాటు, అంటే ఈ నెలాఖరు వరకు అరకులో షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఐదు రోజులు షూటింగ్, అనంతర శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ లో వారం షెడ్యూల్ ప్లాన్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే రాజశేఖర్ ఫ్యామిలీ ఇప్పుడు అరకులో ఉంది.