కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాతో ఆడియన్స్ ని కాస్త డిజప్పాయింట్ చేసాడు. ఒక్క ఫ్లాప్ ఇచ్చి బాడ్ నేమ్ తెచ్చుకున్న శివ కార్తికేయన్ వేంటనే ‘మావీరన్’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. తెలుగులో మహావీరుడు పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ 95 కోట్లు రాబట్టింది. మావీరన్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన శివ కార్తికేయన్ లేటెస్ట్ గా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. SK21 అనే వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని లోకనాయకుడు కమల్‌హాసన్ మరియు ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తుంది. రెహమాన్ మేనల్లుడు అయిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
విశ్వరూపం ఫేమ్ రాహుల్ బోస్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫిజిక్ లో మార్పులు చేసిన శివ కార్తీకేయన్ పర్ఫెక్ట్ మాస్ హీరోగా కనిపించడానికి రెడీ అయ్యాడు. మాములుగా అయితే శివ కార్తికేయన్ కి తమిళనాడులో ఫ్యామిలీ ఇమేజ్ ఎక్కువగా ఉంది. లవ్ స్టోరీస్, ఫన్ మూవీస్ ఎక్కువగా చేయడంతో శివ కార్తికేయన్ సినిమా వస్తుంది అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లిపోతారు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించడానికి రెడీ అయ్యాడు శివ కార్తికేయన్. ఆగస్టు 15న ఈ sk 21 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రివీల్ చేయనున్నారు.