Sherlyn Chopra responds about ranveersingh nude photo shoot:
బాలీవుడ్ స్టార్ హీరో ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం బట్టలు లేకుండా న్యూడ్‌గా ఫోటో షూట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రణ్వీర్ ఫోటో షూట్‌పై ‘అయ్యో ఇదేంటి’ అని నెటిజన్లు పెదవి విరిచారు తప్పితే పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు అయితే కనిపించలేదు. తాజాగా రణ్వీర్ న్యూడ్ ఫోటో షూట్‌పై ప్రముఖ హీరోయిన్ షెర్లీన్ చోప్రా స్పందించింది. గతంలో తాను కాస్త బోల్డ్‌గా ఫోటోలు దిగితే ఎంతో మంది తనను తిట్టారని.. తన క్యారెక్టర్‌ను కూడా తప్పుపట్టారని.. కానీ రణ్వీర్ సింగ్ ఫోటో షూట్‌పై ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదని.. చెత్త సమాజం అంటూ షెర్లీన్ చోప్రా ఫైర్ అయ్యింది. సమాజం ఎందుకిలా ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందో తెలియడం లేదని వాపోయింది.
Read Also: Disha Patani and Tiger Shroff: టైగర్, దిశా విడిపోయినట్లేనా..?
అటు రణ్వీర్ ఫోటో షూట్‌ను ఉద్దేశించి ఆయన భార్య దీపికా పదుకునేను కూడా షెర్లీన్ చోప్రా టార్గెట్ చేసింది. గతంలో ఓ అవార్డుల కార్యక్రమంలో తన దుస్తులు చూసి దీపికా పదుకునే అసహ్యించుకుందని.. అయితే కనీసం అప్పుడు తన ఒంటిపై బట్టలు అయినా ఉన్నాయని.. ఇప్పుడు ఆమె భర్తకు ఒంటిపై నూలుపోగు కూడా లేదని ఎద్దేవా చేసింది. తన దుస్తుల పట్ల అప్పట్లో దీపికా వ్యవహరించిన తీరు తనను చాలా బాధించిందని షెర్లీన్ చోప్రా చెప్పుకొచ్చింది. దీపికా తనను అవమానిపరిచిందని వాపోయింది. కాగా రణ్వీర్ ఫోటో షూట్‌ను మరో నటి అన్వేషి జైన్ సమర్ధించింది. సినిమా రంగంలో ఇలాంటివి సర్వసాధారణమని అభిప్రాయపడింది. ఏదైనా తాము చూసే కోణంలోనే ఉంటుందని.. దీనిని ఒక ఫోటో షూట్‌గా చూస్తే పెద్ద అభ్యంతరమేమీ ఉందని వివరించింది. గతంలో చాలా మంది స్టార్లు కెమెరా ముందు ఇలాంటి సాహసాలు చేసిన దాఖలాలు ఉన్నాయని గుర్తుచేసింది. అయితే ఈ ఫోటో షూట్ ఆధారంగా రణ్వీర్ వ్యక్తిత్వాన్ని తప్పుపట్టలేమని చెప్పింది. ఎందుకంటే ఇది వర్క్ లైఫ్ మాత్రమేనని.. పర్సనల్ లైఫ్ కాదని పేర్కొంది.