శిల్పా శెట్టి, ఆమె భర్త గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. దాదాపు 2 నెలలు జైలులో ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచీ హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 14 న షెర్లిన్ చోప్రా తనపై మోసానికి పాల్పడినందుకు, మానసిక వేధింపులకు పాల్పడినందుకు రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కుంద్రాపై ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను కోరినట్లు ఆమె చెప్పింది.
Read Also : తెలుగు తమ్ముళ్లకు “పెద్దన్న”గా సూపర్ స్టార్
రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్‌తో సంబంధం ఉందని, వాళ్ళ ద్వారా తనను బెదిరించారని, లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోకపోతే జీవితం నాశనం అవుతుందంటూ హెచ్చరించారని ఆమె అన్నారు. ఏప్రిల్ 19 న రాజ్ బలవంతంగా నా ఇంట్లోకి ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని నన్ను బెదిరించాడు అంటూ ఆమె ఆరోపణలు చేయడం మరోమారు సంచలనంగా మారింది.