Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. విజయాలు, అపజయాలు పక్కన పెడితే శర్వా స్టోరీ సెలక్షన్ యూనిక్ గా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. ఇక ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో మరో యంగ్ హీరో అడివి శేష్ తో కలిసి బాలయ్య అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ 3 లో సందడి చేశారు. కుర్ర హీరోలతో బాలయ్య కూడా కుర్ర హీరోగా మారిపోయి చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఇక ఈ షోలోనే శర్వా.. తన జీవితంలో మర్చిపోలేని ఘటనను చెప్పుకొచ్చాడు. జాను సినిమా సమయంలో శర్వాకు పెద్ద ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే.
ఇక దాని గురించి శర్వా మాట్లాడుతూ ” జాను సినిమాలో ఎంతో హిట్ అయిన లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. ఒక షాట్ లో ఫ్లైట్ నుంచి కిందకి దూకి స్కై డైవింగ్ చేయాలి. అందుకు నేను ముందుగానే శిక్షణ తీసుకున్నాను. అంతా ఓకే అనుకున్నాకా షూట్ మొదలుపెట్టాం. 15000 అడుగుల ఎత్తు నుంచి విమానంలో నుంచి దూకేశాను. మధ్యలోకి వచ్చేసరికి ప్యారాచూట్ పనిచేయలేదు. కిందపడిపోయాను. ఆపరేషన్ అయి రైట్ సైడ్ చేతికి రెండు ప్లేట్స్, 24 నట్లు పడ్డాయి. రైట్ సైడ్ కాలికి ఒక ప్లేట్ పడింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు చనిపోతానేమో అనుకున్నారట. పూర్తిగా కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. ఆ రెండేళ్లు నేను ఎంతో బాధను అనుభవించాను. అందరి ప్రార్థనల వల్ల, దేవుడి దయవల్ల కోలుకోగలిగాను” అని చెప్పుకొచ్చారు.