Aadavallu Meeku Johaarlu Pre Release Event : శర్వానంద్ ప్రామిస్… నిలబెట్టుకుంటాడా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. నిన్న హైదరాబాద్‌లో చిత్రబృందం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుకుమార్, కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ అతిథులపై ప్రశంసలు కురిపించారు. ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు సుకుమార్, కీర్తికి ధన్యవాదాలు తెలిపాడు మరియు సాయి పల్లవిని డార్లింగ్ అని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “నేను కూడా ఆమె నుండి హృదయపూర్వకంగా మాట్లాడటం నేర్చుకుంటాను. ఈరోజు ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు రావడానికి అదే కారణం. ఈరోజు హెల్త్ బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చింది. అందుకు ఆమెకు కృతజ్ఞతలు’’ అని శర్వానంద్ అన్నారు.
Read Also : Ravi Teja : మేనేజర్ ఇంట వేడుక… మాస్ మహారాజా సందడి
Also Read
శర్వానంద్ తన సహ నటులకు కృతజ్ఞతలు తెలుపుతూ “నేను సినిమాలో చాలా మంది ప్రతిభావంతులైన మహిళా కళాకారులతో పని చేశాను. ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని అన్నారు. “ఆడవాళ్లు మీకు జోహార్లు నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మార్చి 4న మీ అందరినీ థియేటర్లలో కలుస్తున్నాం. నా బలం ఫ్యామిలీ ఎంటర్టైనర్… ఈ మధ్యకాలంలో నేను వాటిని మిస్ అవుతున్నాను. ఇది మీ అందరికీ తెలుసు. ఈ సినిమాతో నా బలంతో మళ్లీ వచ్చాను. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని శర్వానంద్ ఎంతో నమ్మకంతో చెప్పారు. ఒక మంచి సినిమా చూశామన్న తృప్తితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను అని శర్వానంద్ తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!