Sharwanand: కుర్ర హీరో శర్వానంద్.. గత వారమే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రక్షితా రెడ్డితో శర్వా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కుర్రహీరో పెళ్ళికి అతిరథ మహారధులు హాజరయ్యి నవదంపతులను ఆశీర్వదించారు. ఇక పెళ్ళిలో శర్వా బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ చరణ్, సిద్దార్థ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక రేపు అనగా జూన్ 9 న శర్వా- రక్షిత రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను రిసెప్షన్ కు ఆహ్వానించాడు శర్వా. తాజాగా ఆయన సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశాడు.
Aata Sundeep: పెళ్లి తరువాత లవ్ ఎఫైర్.. నా భార్యే దగ్గర ఉండి ముద్దు పెట్టించింది
కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ కలిసిన శర్వా.. తన రిసెప్షన్ కు ఆహ్వానించాడు. ఇక శర్వా ఆహ్వానం అందుకున్న కేసీఆర్ తప్పకుండా వస్తాను అని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం హాజరుకానుంది. ఈ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం శర్వా పెళ్లి వేడుకల్లో ఉన్నాడు.. ఈ హడావిడి మొత్తంతగ్గాకా ఆయన హనీమూన్ కోసం కొన్ని రోజులు వెచ్చించినట్లు తెలుస్తోంది. అవన్నీ ముగిశాకా ఈ హీరో సెట్ లో అడుగుపెట్టనున్నాడట. మరి పెళ్లి తరువాత శర్వా రేంజ్ ఏ రేంజ్ లో మారుతుందో చూడాలి.