Beenz Restaurent Relaunched at Hyderabad: విభిన్న రుచులు కోరుకునే భాగ్య నగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 44 లో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్జ్ రెస్టారెంట్ ను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టాలీవుడ్ హీరో శర్వానంద్, పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.
Darshan: ‘నన్ను వదిలేయండి’ ప్లీజ్.. పోలీసుల కాళ్లపై పడ్డ దర్శన్?
తెలుగు వంటకాల రుచులతో పాటు కాంటినెంటల్ ఫూడ్ అందించేందుకు సరికొత్త థీమ్ తో ఈ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకు వచ్చామని నిర్వాహకులు శర్వానంద్ సోదరుడు అర్జున్ మైనేని తెలిపారు. ఎండిలుగా ఉన్న డి. వంశీ కృష్ణంరాజు, ప్రశాంత్ రెడ్డిలు అతిధులను స్వాగతించారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. 2008 నుంచి బిన్ల్ పేరుతో తన సోదరుడు అథిధ్యరంగంలో సేవలని అందిస్తున్నారని…ఈ రెస్టారెంట్ లో ఎన్నో మెమోరిస్ ఉన్నాయని… ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి టైమ్ స్పెండ్ చేసేవాళ్ళమని… రామ్ చరణ్, అఖిల్ తో కలిసి ఉండే రోజులను గుర్తు చేసుకున్నారు శర్వానంద్.