కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అయ్యింది. హిట్ కాదు షారుఖ్ సినిమా రిలీజ్ అయ్యే నాలుగున్నర ఏళ్లు అవుతోంది. 2018లో వచ్చిన ‘జీరో సినిమా’ తర్వాత షారుఖ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫుల్ లెంగ్త్ సినిమా రిలీజ్ కాలేదు. లాల్ సింగ్ చడ్డా, బ్రహ్మాస్త్ర పార్ట్ వన్, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ లాంటి సినిమాల్లో షారుఖ్ చిన్న క్యామియో ప్లే చేశాడు కానీ అవన్నీ షారుఖ్ ఫాన్స్ ని సంతోషపరిచే అంత పెద్దవి కాదు. నిజానికి బాలీవుడ్ ప్రస్తుతం ఉన్న స్లంప్ కి షారుఖ్ కూడా కారణమే, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా టాప్ మోస్ట్ స్టార్ ఫ్లాప్స్ లో ఉంటే ఆ ఇండస్ట్రీలో రెవెన్యు రొటేట్ అవ్వదు. అలాంటిది ఫేస్ ఆఫ్ బాలీవుడ్ అనేలా హిట్స్ ఇచ్చిన షారుఖ్, సినిమాలే చెయ్యకుంటే ఇంకా మనీ ఎక్కడి నుంచి రొటేట్ అవుతుంది. ఇదే సమయంలో మిగిలిన హీరోలు కూడా ఫ్లాప్స్ ఇచ్చారు, దీంతో బాలీవుడ్ స్లంప్ లోకి వెళ్లిపోయింది. బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేయడానికి, మళ్లీ హిట్ స్ట్రీక్ లోకి ఎంటర్ అవ్వడానికి షారుఖ్ 2023లో మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు.
షారుఖ్ ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ‘జవాన్’, ‘పఠాన్’, ‘డుంకీ’… ఈ మూడు సినిమాలు 2023లోనే ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. వీటిలో ‘జవాన్’, ‘పఠాన్’ సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్స్ కాగా ‘డుంకీ’ మాత్రం ‘రాజ్ కుమార్ హిరాణీ’ స్టైల్ లో ఉండే సినిమా. 3 ఇడియట్స్, మున్నా భాయ్ MBBS, సంజు లాంటి సినిమాలని తెరకెక్కించిన ‘రాజ్ కుమార్ హిరాణీ’తో షారుఖ్ సినిమా అనౌన్స్ చేసినప్పుడే, ఆడియన్స్ లో ఒక క్యురియాసిటి ఏర్పడింది. కొందరు భారతీయులు అమెరికా, కెనడాలకి వెళ్లడానికి బ్యాక్ డోర్ వి వాడుతారు. దీన్నే ‘డాంకీ ఫ్లైట్’ అంటారు. ఈ డాంకీ ఫ్లైట్ అనే కాన్సెప్ట్ ని కథగా చేసుకోని ‘డుంకీ’ సినిమా తెరకెక్కుతోంది. సౌదీ అరేబియాలో ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అక్కడి నుంచి షారుఖ్ ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో ఎప్పటిలాగే తన స్మైల్ తో మ్యాజిక్ చేశాడు షారుఖ్. షారుఖ్ అనే పేరు ట్రెండ్ అవ్వడానికి ఒక్క ఫోటో చాలు, వచ్చే ఏడాది మూడు సినిమాలతో మేమేంటో చూపిస్తాం… బాక్సాఫీస్ కింగ్ తిరిగొస్తాడు అంటూ షారుఖ్ ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. షారుఖ్ కంబ్యాక్ ఇస్తే బాలీవుడ్ కష్టాలు దాదాపు తీరిపోయినట్లే. మరి 2023లో షారుఖ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.