ఒక సినిమా రికార్డుని ఇంకో సినిమా బ్రేక్ చెయ్యడం అనేది మామూలే. ప్రతి ఇండస్ట్రీలో ఏ సినిమా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా ఎదో ఒక రికార్డ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే ఆమిర్ ఖాన్ క్రియేట్ చేసిన ఒక రికార్డ్ మాత్రం కొన్ని సంవత్సరాలుగా టాప్ లోనే ఉంది. దంగల్ మూవీతో ఆమిర్ ఖాన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాశాడు. హిందీ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే దాదాపు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసిన దంగల్ సినిమా 2016లో రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఎన్నో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి, హిట్ అయ్యాయి, సూపర్ హిట్ కూడా అయ్యాయి కానీ దంగల్ రికార్డ్స్ ని మాత్రం టచ్ చెయ్యలేకపోయాయి. రాజమౌళి రికార్డ్స్ ని మిగిలిన వాళ్ళతో పోల్చి చూడలేము కాబట్టి… నాన్-రాజమౌళి రికార్డ్స్ లో దంగల్ సినిమా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉంది.
ఇన్నేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న దంగల్ రికార్డుని బ్రేక్ చేశాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. పఠాన్ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్, రెండున్నర వారాలకే 850 కోట్ల వరకూ రాబట్టాడు. ఓవర్సీస్ లోనే 35౦ వరకూ రాబట్టింది అంటే పఠాన్ సినిమా ర్యాంపేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వెస్ట్రన్ కంట్రీస్ లో సెన్సేషనల్ రన్ మైంటైన్ చేస్తున్న పఠాన్ సినిమా, హిందీలో దంగల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ పఠాన్ మూవీనే. KGF 2 హిందీ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన షారుఖ్ ఖాన్, ఇదే జోష్ ని మైంటైన్ చేస్తే బాహుబలి 2 కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడానికి మరో వారం పది రోజులు మాత్రమే పడుతుంది.
The Sun is alone….it Burns….and comes out of the darkness to Shine again. Thank u all for letting the Sun shine on #Pathaan. pic.twitter.com/BQbHE05JqE
— Shah Rukh Khan (@iamsrk) February 8, 2023