ప్రముఖ నటుడు రిషీ కపూర్ 2020 ఏప్రిల్ 30న లుకేమియాతో కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ది బాడీ’ దానికి ముందు సంవత్సరం విడుదలైంది. అయితే అప్పటికే సెట్స్ పై ఉన్న ‘శర్మాజీ నమ్కీన్’ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. హితేశ్ భాటియా దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాలో జుహీచావ్లా, సుహైల్ నయ్యర్, తరుక్ రైనా, సతీష్ కౌశిక్, షీబా చద్దా, ఇషా తల్వార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిషీ కపూర్ మరణానంతరం ఆయన పాత్రను ప్రముఖ హిందీ నటుడు పరేశ్ రావెల్ తో చిత్రీకరించారు దర్శకులు. ఇప్పుడీ సినిమాను మార్చి 31వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
Read Also : AP Govt new G.O : కొత్త జీవోపై మహేష్ బాబు రియాక్షన్
జీవిత పరమార్థాన్ని తెలియచేసే ఓ మధ్య తరగతి మనిషి కథ ఇదని, ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. రిషీ కపూర్ కు నివాళిగా ఈ సినిమాను జనం ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. ఒకే పాత్రను ఇద్దరు లెజెండరీ ఆర్టిస్టులు పోషించడం బహుశా గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు. ఈ చిత్రాన్ని రితేష్ సిద్వావీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు.