Sharathulu Varthisthai Trailer: మధ్య తరగతి వాడు తిరగబడితే.. ఎట్లుంటుందో చూపిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharathulu Varthisthayi Trailer: చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న షరతులు వర్తిస్తాయి సినిమా మార్చి 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమాలో చైతన్య పేరు చిరంజీవి, భూమి పేరు విజయశాంతి. వీరిద్దరూ చిన్నతనం నుంచి ప్రేమించుకుంటారు. ఊర్లో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లి చేసుకుంటారు. మధ్యతరగతి ఆప్యాయతలు, అనురాగాల మధ్య సాగుతున్న వీరి జీవితంలోకి బోగస్ కంపెనీ చిచ్చు పెడుతుంది. కష్టపడకుండా డబ్బు సంపాదించొచ్చు అని ఆశపడి.. తాము దాచుకున్న డబ్బును ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేయాలనుకుంటారు. అయితే.. ఆ కంపెనీ ఆ డబ్బును తీసుకొని ఉడాయిస్తుంది. దీంతో అందరి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇక ఈ సమస్యను చిరంజీవి ఎలా పరిష్కరించాడు. మధ్య తరగతి వాడు తిరగబడితే.. ఎట్లుంటుంది.. ఇలాంటి కంపెనీలను ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు.. ? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా మొత్తం ఒక రోలర్ కాస్ట్ లా ఉండబోతుందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది. అరుణ్ చిలువేరు మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ తోనే సినిమాకు ఒక హైప్ తీసుకొచ్చారు. మరి ఈ సినిమాతో చైతన్య రావు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!