Indian 2: శంకర్ సర్ సినిమాలు చేస్తున్నారా? సీరియల్స్ చేస్తున్నారా? మరీ పోస్ట్ సమ్మర్ కి వాయిదా ఏంటండీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2 సినిమా సీరియల్ చెక్కినట్లు చిక్కుతూనే ఉన్నాడు. క్లారిటీ లేదో లేక అనివార్య కారణాల ఎఫెక్టో తెలియదు కానీ వాయిదా తర్వాత మొదలైన ఇండియన్ 2 షూటింగ్ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని 2024 జనవరికి రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. సరేలే ఇండియన్ 2 సంక్రాంతికి వస్తే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సమ్మర్ కి షిఫ్ట్ అవుతుంది, ఎక్కువ సెలవలు దొరుకుతాయి కాబట్టి మన సినిమాకి మంచి జరుగుతుందనుకున్నారు మెగా ఫ్యాన్స్.
ఇప్పుడు ఇండియన్ 2 సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి కూడా దాటేసి ఆగస్టు 15కి షిఫ్ట్ అవుతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ మాటలో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ఇప్పటికైతే ఇండియన్ 2 ఇండిపెండెన్స్ వీక్ ని టార్గెట్ చేస్తుందని సమాచారం. ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకూ గేమ్ ఛేంజర్ బయటకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. దిల్ రాజు అంతటి ప్రొడ్యూసర్… మన చేతిలో ఏం లేదు అంతా డైరెక్టర్ చేతిలో ఉంది అనే కామెంట్స్ చేస్తున్నాడు. బాహుబలి, KGF, ఆర్ ఆర్ ఆర్ లా పీరియాడిక్ డ్రామాని అయితే శంకర్ తెరకెక్కించట్లేదు. ఇండియన్ 2 ఫక్తు కమర్షియల్ సినిమా… మరి దీనికి ఎందుకు రెండు మూడేళ్ల సమయం పడుతుందో శంకర్ కే తెలియాలి.
Also Read
తాజావార్తలు
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!