చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్.. అది ఎప్పుడు మెయింటైన్ చేస్తేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ అందం తో పాటు అభినయంతో కూడా అలరిస్తారు. అలాంటివారికి గ్లామర్ పెద్ద లెక్కేలోకి రాదు. కొన్ని ఐకానిక్ పాత్రల్లో కనిపించిన హీరోయిన్స్ ను అభిమానులు అలాగే గుర్తుపెట్టుకుంటారు. వారు లావు అయినా , సన్నగా అయినా ఆ పాత్రలో ఉన్న హీరోయిన్ మాత్రమే తమకు కావాలంటారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్లందరూ బరువు తగ్గడం మొదలుపెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్, షాలిని పాండే.. అయితే చక్కనమ్మ చిక్కినా అందమే అన్నమాట వాస్తవమే కానీ.. మరీ ఇంత బక్కచిక్కితే మాత్రం కష్టం అంటున్నారు ఫ్యాన్స్.. తాజాగా షాలిని పాండే ఫొటోస్ చుస్తే అస్సలు ఈమెనా అని గుర్తుపట్టలేకపోతున్నారు అభిమానులు.. అంతలా ఆమె మారిపోయింది.
‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో ప్రీతిగా ముద్దుగా బొద్దుగా కనిపించి టాలీవుడ్ కుర్రాళ్ళ మనస్సులో కొలువుండిపోయింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ భామకు అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇక దీంతో తన బరువే తనకు సమస్య అనుకున్నదో లేక బాలీవుడ్ లో పాగా వేయాలంటే జీరో సైజు కావాలనుకున్నదో తెలియదు కానీ షాలిని బరువు తగ్గి సన్నజాజి తీగలా మారిపోయింది. అయితే ఇలా షాలిని సన్నబడడం వరకు బాగానే ఉంది కానీ మరీ మితిమీరి సన్నబడ్డట్లు కనిపిస్తోంది.. అంతకుముందు ఫేస్ లో ఉన్న కళ ఇప్పుడు లేదని, బక్కచిక్కి కనిపిస్తున్నది అని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం షాలిని హిందీలో పలు సినిమాలో నటిస్తూ మెప్పిస్తోంది. మరి అమ్మడు టాలీవుడ్ వైపు ఎప్పుడు తిరిగి చూస్తుందో చూడాలి.