Dunki: ‘డంకీ’ సినిమా చూడడానికి స్వదేశానికి షారూక్ ఖాన్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahrukh Fans getting ready to watch Dunki in india: షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’ డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వందలాది మంది షారూక్ ఖాన్ అభిమానులు డిసెంబర్ నెలలో ఈ సినిమాను తమ మాతృదేశమైన భారత్‌లో చూడటానికి ఇక్కడకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. డంకీ సినిమాలో ఆకట్టుకునే విజువల్స్, భావోద్వేగాలు విదేశాల్లోని వారికి తమ మాతృదేశానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చాయని వారు తమ కుటుంబాలు, సన్నిహితులతో కలిసి ఈ క్రిస్మస్ పండుగ సీజన్లో డంకీ సినిమాను చూసి ఆ యూనిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని పొందటానికి తహతహ లాడుతున్నారని సినిమా యూనిట్ వెల్లడించింది. ఇలా ప్రపంచం నలు మూలల నుంచి వచ్చిన అభిమానులు తమ అభిమాన కథానాయకుడు నటించిన డంకీ సినిమా గ్లోబల్ సెలబ్రేషన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. షారూక్ ఖాన్ సినిమాలను ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రమోట్ చేయటానికి ఆయన అభిమాన సంఘాలు వినూత్న మార్గాలను అన్వేషిస్తుంటాయి, ఈ రామంలో డంకీ విషయంలోనూ అలాంటి మార్గాన్నే వారు ఎంచుకున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, షారూక్ పాత్ర తన ప్రియమైన వారి కోసం సరిహద్దులు దాటుతుంది, కొందరు సరిహద్దులను దాటటానికి అక్రమైన మార్గాలను ఎంచుకుంటుంటారు. కానీ ఇక్కడ అభిమానులు సరిహద్దులను దాటటానికి చట్ట బద్దమైన మార్గాలను ఎంచుకుంటున్నారు.
Ashish Reddy: ఘనంగా దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ నిశ్చితార్థం..
Also Read
ప్రియమైన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లాలనేది సినిమా మెయిన్ థీమ్ కావడంతో అదే సెంటిమెంట్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఇక ‘‘అభిమానులకు అందుబాటు థియేటర్స్‌లోనే డంకీ సినిమాను ఉంటుంది, మూవీలోని విజువల్స్ వారికి వారి కుటుంబాలను, స్నేహితులను గుర్తుకు తెస్తుంది. అందువల్ల వారు అందరితోకలిసి డంకీ సినిమాను ఆస్వాదించాలనుకుంటారు. నేపాల్, కెనడా, అమెరియా, ఎమిరేట్స్ తదితర దేశాల నుంచి 500కి పైగా అభిమానులు డంకీ సినిమా కోసం ఇండియాకు వస్తున్నారు’’ అని సన్నిహిత వర్గాల సమాచారం. డంకీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠత నెలకొంది. డంకీ డ్రాప్ 1 వీడియోతో పాటు డంకీ డ్రాప్ 2 విడుదలైన లుట్ పుట్ గయా.. సాంగ్ అంచనాలను పెంచాయి. ప్రేమ, స్నేహం వంటి ఎమోషనల్ అంశాలతో సినిమా తెరకెక్కింది. డంకీ’ చిత్రంలో బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, కణిక థిల్లాన్ ఈ చిత్రానికి రచయితలు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.
తాజావార్తలు
-
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
-
Jio Recharge Plans: జియో రూ.949 vs రూ.1029 ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీ.. ఏది బెస్ట్?
-
Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
-
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు 10 లోకి కాంట్రవర్సీ యూట్యూబర్ నందన ?
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!