Ashish Reddy: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన తమ్ముడు శిరీష్ కొడుకు, హీరో ఆశిష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అద్వైత రెడ్డి అనే అమ్మాయితో శిరీష్ ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. అద్వైత.. ఒక బిజినెస్ మేన్ కూతురు అని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. గత కొన్ని రోజుల క్రితమే ఆశిష్ పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెల్సిందే. అయితే ఇలా సైలెంట్ గా ఆశిష్ నిశ్చితార్థం జరుగుతుందని ఎవరు ఊహించలేదు. లైట్ గ్రీన్ కలర్ షేర్వాణీలో ఆశిష్, అదే కలర్ లెహంగాలో అద్వైత ఎంతో అందంగా కనిపించారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఇక కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Brahmanandam: బ్రహ్మీతో అంత ఈజీ కాదు.. ఇచ్చి పడేశాడు
ఇక దిల్ రాజు కు ఒక కుమార్తె హర్షిత రెడ్డి అని అందరికీ తెల్సిందే. ఆమె మొదటి భార్య కూతురు.. ఇప్పుడు రెండో భార్యకు ఒక కుమారుడు. నటన పరంగా శిరీష్ కొడుకు ఆశిష్ నే దిల్ రాజు తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా హిట్ అందుకోలేకపోయిన.. ఒక మోస్తరుగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆశిష్ సెల్ఫిష్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ మధ్యనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.