బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇటీవలే జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో విజయ ఢంకా మోగిస్తుంది.క్రికెట్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కొడుకు కోరికను నేరవెర్చే తండ్రిగా షాహిద్ ఒదిగిపోయాడు. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న షాహిద్ ఇటీవల ఒక నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
” నాకు పదేళ్లు వచ్చేవరకు మేము ఢిల్లీలోనే ఉన్నాం. అక్కడ స్కూల్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఆ స్కూల్ టీచర్లు నన్ను ఎంతో సపోర్ట్ చేసేవారు. ఆడుకోనిచ్చేవారు. ఫ్రెండ్స్ లా మెలుగుతూ అన్ని అర్ధం అయ్యేలా చెప్పుకొచ్చేవారు. అయితే అమ్మ జాబ్ రీత్యా ఆ తర్వాత మేము ముంబై కి బదిలీ అయ్యాం. అక్కడి స్కూల్ డేస్ ను నేను గుర్తుతెచ్చుకోలేను. ఆ స్కూల్ అంటేనే నాకు అసహ్యం. అక్కడి టీచర్లు నన్ను వేధించేవారు. నాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. అందుకే ఆ స్కూల్ డేస్ అంటే నాకు అస్సలు నచ్చవు” అని చెప్పుకొచ్చాడు . ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.