బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ మరియు జవాన్ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.ఆ రెండు సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపాయి.రెండు బ్లాక్ బస్టర్స్ తో జోష్ మీద షారుఖ్ ఖాన్ తాజాగా ‘డంకీ’ సినిమాలో నటించాడు.ఈ సినిమాను పీకే మరియు త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించారు.దీంతో షారుఖ్ హీరోగా నటించిన ‘డంకీ’ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది..రాజ్ కుమార్ హిరాని దర్శకుడు కావడంతో డంకీ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే, డంకీ సినిమాకు ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక రెండో రోజు కూడా డంకీ కలెక్షన్లు డౌన్ అయ్యాయి..డంకీ సినిమా ఇండియాలో రెండు రోజుల్లో రూ.49.20కోట్ల నెట్ కలెక్షన్లను సాధించగలిగింది. గురువారమైన తొలి రోజు రూ.29.2 కోట్లను కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. శుక్రవారం రూ.20కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. పఠాన్, జవాన్ తొలి రెండు రోజుల కలెక్షన్లతో పోలిస్తే ఇది సగం కన్నా తక్కువే అని తెలుస్తుంది.
ఇక, ప్రపంచవ్యాప్తంగా డంకీ చిత్రానికి తొలి రోజు రూ.58కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు రూ.45కోట్ల వరకు వస్తుందని అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.100కోట్ల గ్రాస్‍ను ఈ మూవీ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.షారుఖ్ నుంచి ఈ ఏడాది వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ కాగా.. డంకీ మాత్రం కామెడీ, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీకి తక్కువ ఓపెనింగ్స్ రావడానికి ఇది కూడా ఓ కారణం అని చెప్పొచ్చు.అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ రిలీజ్ కావడంతో రెండో రోజు డంకీ మూవీపై గట్టిగానే ఎఫెక్ట్ పడింది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా శుక్రవారం (డిసెంబర్ 22) రిలీజ్ అయింది. దీంతో డంకీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. సలార్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో డంకీ పై బాగానే ప్రభావం పడనున్నట్లు తెలుస్తుంది