Happy Birthday Shah Rukh Khan : ‘పఠాన్’ గా వస్తున్న షారుఖ్ ఖాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన తాజా చిత్రం ‘పఠాన్’పైనే షారుఖ్ ఖాన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పుడు ‘కింగ్ ఖాన్’, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘బాద్ షా ఆఫ్ బాలీవుడ్’ – ఇలా జేజేలు అందుకున్న షారుఖ్ ఖాన్ తో గత కొన్నేళ్ళుగా విజయం దోబూచులాడుతోంది. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు కళ్ళు ఇంతలు చేసుకొని కాచుకొని ఉండేవారు. షారుఖ్ నటించిన ‘రొమాంటిక్ మూవీస్’ అనేకం బాక్సాఫీస్ బరిలో నిలచి, జనం మదిని గెలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ నిలచింది. ఆ సినిమా విడుదలైన రోజుల్లో షారుఖ్ ఖాన్ చేయి తగిలితే చాలు అని ఎంతోమంది అభిమానులు ఆశించేవారు. ఇక అమ్మాయిల్లో రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటూ సాగారు షారుఖ్. అతని పేరు వింటే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయిన వారెందరో ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ ను పరాజయాలు పలకరించగానే, ఆ నాటి క్రేజు, మోజు అన్నీ కరిగిపోయాయి. ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం షారుఖ్ ఖాన్ పట్టువీడని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అభిమానులు ‘ఎస్.ఆర్.కె.’ అంటూ పిలుచుకొనే షారుఖ్ ఖాన్ 1965 నవంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీలోని హన్స్ రాజ్ కాలేజ్ లో ఎకనామిక్స్ చదివారు షారుఖ్ ఖాన్. స్పోర్ట్స్ అంటే అతనికి ప్రాణం. స్పోర్ట్స్ మేన్ గానే సాగాలని ఆశించారు. అయితే డిగ్రీ చదివే రోజుల్లో ఎక్కువగా ‘థియేటర్ యాక్షన్ గ్రూప్’లో గడిపారు. అక్కడే బ్యారీ జాన్ దగ్గర నటనలో శిక్షణ పొందారు ఖాన్. అనేక టెలివిజన్ సీరియల్స్ లో షారుఖ్ నటించారు. అదే సమయంలో గౌరీతో ఆయనకు పరిచయం ఏర్పడి, ప్రణయంగా మారింది. తరువాత పరిణయమూ జరిగింది. గౌరీని పెళ్ళాడిన వేళావిశేషమేమో కానీ, షారుఖ్ కు తొలి సినిమా ‘దీవానా’తోనే నటునిగా మంచి గుర్తింపు లభించింది. దాంతో అవకాశాలూ పలకరించాయి. తరువాత షారుఖ్ నటించిన చిత్రాలు మోస్తరు విజయాలు సాధిస్తూ సాగాయి. ‘బాజీగర్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో షారుఖ్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా ఘనవిజయంతో షారుఖ్ స్టార్ హీరో అయిపోయారు. వరుసగా వచ్చిన “డర్, కభీ హా కభీ నా, అంజామ్, కరణ్ అర్జున్’ మంచి గుర్తింపు సంపాదించాయి. ఇక ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’తో బంపర్ హిట్ చూశారు షారుఖ్. ఆ సినిమా ఘనవిజయం తరువాత దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. మళ్ళీ ఆ స్థాయి హిట్ షారుఖ్ కు లభించలేదు. కానీ, ఆయన నటించిన “పర్దేశ్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మొహబ్బతే, కభీ ఖుషి కభీ ఘమ్, దేవదాస్, మై హూ నా, వీర్-ఝారా, డాన్, చక్ దే ఇండియా, ఓమ్ శాంతి ఓమ్, రబ్ నే బనాదీ జోడీ, మై నేమ్ ఈజ్ ఖాన్, డాన్-2, చెన్నైఎక్స్ ప్రెస్” వంటి చిత్రాలు జనాన్ని భలేగా అలరించాయి. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ షారుఖ్ ను పలకరించలేదు. ఆ పై వచ్చిన షారుఖ్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే చవిచూశాయి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నటునిగా షారుఖ్ ఖాన్ కీర్తి కిరీటంలో పలు అవార్డులూ రివార్డులూ ఉన్నాయి. 2005లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారాయన. ఫ్రెంచ్ ప్రభుత్వం ‘ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్, లెజియన్ డీఆనర్’ అవార్డులతో షారుఖ్ ను సన్మానించింది. షారుఖ్ ఈ యేడాదంతా కేమియో అప్పియరెన్స్ తోనే సరిపుచ్చారు. ఆ సినిమాలూ బాక్సాఫీస్ వద్ద పొడిచేసిందేమీ లేదు. 2023లో ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ హీరోగా రానున్నారు. అయితే ఇప్పటికే ఆ సినిమా టైటిల్ కారణంగా కొందరు ‘బాయ్ కాట్’ బ్యాచ్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ‘పఠాన్’గా అలరిస్తేనే ఆ తరువాత వచ్చే ఆయన హీరోగా నటించిన చిత్రాలకు కాసింత క్రేజ్ దక్కుతుంది. తమిళ డైరెక్టర్ అట్లీ నిర్దేశకత్వంలో ‘జవాన్’ చిత్రంలోనూ షారుఖ్ నటిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ‘డంకీ’ అనే సినిమాలోనూ షారుఖ్ అభినయిస్తున్నారు. ఈ చిత్రాలకంటే ముందు రానున్న ‘పఠాన్’ వైపే షారుఖ్ ఫ్యాన్స్, ఆ టైటిల్ కారణంగా ఆ సినిమాను వ్యతిరేకించేవారు ఎదురుచూస్తున్నారు. మరి ‘పఠాన్’గా షారుఖ్ ఏ రీతిన అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!