Shaakuntalam: సమంతా తొలి స్పందనేంటి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha:’ఫ్యామిలీ మ్యాన్ -2′ వెబ్ సీరిస్ తో సమంత పాన్ ఇండియా స్టార్ గా అవతరించింది. ఆ తర్వాత వచ్చిన ‘యశోద’ చిత్రం కూడా నాలుగు భాషల్లో విడుదలై సమంతకు మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు అదే బాటలో ‘శాకుంతలం’ కూడా విడుదల కాబోతోంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్ బ్యానర్ లో నీలిమా గుణ నిర్మించిన ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ ప్లే చేసింది. సినిమా అనేది లార్జర్ దేన్ లైఫ్‌గా ఉండాలంటూ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ గుణశేఖర్ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ‘శాకుంతలం’ను రూపొందించారు. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న త్రీడీ వర్షన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని కొద్ది రోజుల క్రితం చిత్ర బృందం తెలిపింది.
‘శాకుంతలం’ తొలి కాపీని దర్శకుడు గుణశేఖర్ తాజాగా సిద్ధం చేశారు. దాన్ని ఇటీవల వీక్షించిన సమంత తన మనసులోని భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. ”’శాకుంతలం’ను ఎంతో అందంగా తెరకెక్కించిన గుణశేఖర్ గారూ.. మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. మన ఇతిహాసాలలో ఒక్కటైన శాకుంతలానికి మీరు జీవం పోశారు. కుటుంబ ప్రేక్షకులు ఇందులోని భావోద్వేగాలకు కరిగిపోతారు. ఇప్పుడెప్పుడు వారు ఈ సినిమా చూస్తారా అనిపిస్తోంది. పిల్లలు కూడా ఈ మ్యాజికల్ వరల్డ్ ను భలే లవ్ చేస్తారు. నా ఈ అద్భుతమైన ప్రయాణానికి కారణమైన ‘దిల్’ రాజు, నీలిమకు ధన్యవాదాలు. ‘శాకుంతలం’ ఎప్పటికీ నా మదికి దగ్గరగా ఉండే సినిమా” అని సమంత పేర్కొంది.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
‘శాకుంతలం’ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. శేఖర్ వి. జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వటానికి రీ-రికార్డింగ్‌ను బుడాపెస్ట్, హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో డా. ఎం.మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సుసేన్ గుప్తా కీలక పాత్రలను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించటం ప్రధాన ఆకర్షణ కానుంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1635530410108043264
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!