టబుకు యాభై ఏళ్ళు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. నవంబర్ 4తో టబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే టబు తపిస్తున్నారు.
టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971 నవంబర్ 4న హైదరాబాద్ లో టబు జన్మించారు. విజయనగర్ కాలనీలోని సెయింట్ యాన్స్ హైస్కూల్ లో పదో తరగతి చదివిన టబు, తరువాత ముంబయ్ చేరి, అక్కడ సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో ప్లస్ టూ పూర్తి చేశారు. హైదరాబాద్ లో చదువుతూ ఉండగానే టబు, స్మితాపాటిల్ నటించిన ‘బజార్’లో బాలనటిగా నటించింది. అది కాగానే 1985లో దేవానంద్ తెరకెక్కించిన ‘హమ్ నౌజవాన్’లో టీనేజ్ గాళ్ గా నటించి మురిపించింది. అయితే టబు నాయికగా నటించిన తొలి చిత్రం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘కూలీ నంబర్ 1’. అందులో ఆమె పేరు స్వాతి అని ప్రకటించారు. టబు అక్క ఫరా కూడా అంతకు ముందే హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించారు. ఆమె కూడా వెంకటేశ్ సరసన ‘విజేత విక్రమ్’లో నాయికగా కనిపించారు. తొలి సినిమా ‘కూలీ నంబర్ వన్’లోనే టబు తన అందాల ఆరబోతతో కుర్రకారును కిర్రెక్కించింది. మహానటి షబానా ఆజ్మీ కూడా టబుకు సమీపబంధువు.
Also Read
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
- APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
- Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
టబు ఉత్తరాదికి వెళ్ళి హిందీ చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఆరంభంలో అక్కడ పలు పరాజయాలే ఆమెను పలకరించాయి. అజయ్ దేవగణ్ సరసన నటించిన ‘విజయ్ పథ్’మంచి పేరు సంపాదించి పెట్టింది. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటించిన తొలి చిత్రం ‘సిసింద్రీ’లో టబు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఆ తరువాత అదే నాగ్ సరసన నాయికగా ‘నిన్నే పెళ్ళాడతా’లో నటించారు టబు. ఆ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్ హిట్ అని చెప్పవచ్చు. అదే యేడాది గుల్జార్ తెరకెక్కించిన ‘మాచిస్’తో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు టబు. తమిళంలో ఆమె నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో అనువాదమై అనూహ్య విజయం సాధించింది. ‘చాందినీ బార్’తోనూ టబు మరోమారు ఉత్తమనటిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
టబు నటించిన “విరాసత్, బోర్డర్, చాచీ 420, హు తు తు, తక్షక్, చాందినీ బార్, మక్బూల్, చీనీ కుమ్, హైదర్, అంధాదున్”వంటి చిత్రాలు మంచి ఆదరణ చూరగొన్నాయి. ఇక తెలుగులో నాగార్జున సరసన ‘ఆవిడా మా ఆవిడే’లోనూ, బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి, పాండురంగడు’ చిత్రాలలోనూ, చిరంజీవి జంటగా ‘అందరివాడు’లోనూ నటించి మెప్పించారు టబు. “షాక్, ఇదీ సంగతి” చిత్రాలలోనూ టబు కనిపించారు. గత సంవత్సరం విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో హీరోకు తల్లిగా నటించిన టబు, ఆ సినిమాలోనూ తనదైన బాణీ పలికించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం “భూల్ భులయ్యా -2, భీష్మ పర్వమ్, ఖుఫియా” చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో ‘భీష్మ పర్వమ్’ మళయాళ సినిమా. మరి ఈ చిత్రాలతో టబు ఏ రీతిన జనాన్ని ఆకట్టుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!