Sudhakar: నేను బ్రతికే ఉన్నాను… దయచేసి వాటిని నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయ్యాక ఏ వార్తని నమ్మాలో ఏ వార్తని నమ్మకూడదో తెలియని పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సగానికి పైగా రూమర్స్ మాత్రమే ఉన్నాయి, ఇక సినిమా వాళ్ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ స్టార్స్ గురించి అయితే వాళ్లు డేటింగ్ లో ఉన్నారు, వీళ్లు రిలేషన్ లో ఉన్నారు అని రాస్తారు. ఒకవేళ కాస్త ఏజ్డ్ ఆర్టిస్టుల గురించి అయితే వారు కష్టాల్లో ఉన్నారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అని రాస్తారు. అనారోగ్యం అయినా కాస్త బెటర్, కొంతమంది గురించి అయితే ఏకంగా మరణించారు అని రాయడం కూడా సోషల్ మీడియాలో మనం తరచుగా చూస్తే ఉండేదే. కోట శ్రీనివాస్ రావు లాంటి లెజెండరీ యాక్టర్ తనపై వస్తున్న రూమర్స్ విని, నేను బ్రతికే ఉన్నాను అని ఉగాది పండగ రోజు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఈ రూమర్స్ ఎంతగా స్ప్రెడ్ అవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా ఇలాంటి రూమర్స్ ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ గురించి వైరల్ అవుతున్నాయి.
సినిమాలకి దూరంగా ఉన్న సుధాకర్ మరణించాడు అనే వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో… “అందరికీ నమస్కారం. నా మీద వచ్చినవన్నీ అసత్య వార్తలే. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాంటివి స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ” అంటూ సుధాకర్ వీడియో రిలీజ్ చేసాడు. సుధాకర్ ఆరోగ్యం గురించి ఇలాంటి ఫేక్ రూమర్స్ వినిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2010లో సుధాకర్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడి కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే సుధాకర్ మరణించారనే వార్త తెగ వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుండటంతో సుధాకర్ స్వయంగా వీడియో రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇప్పటికైనా సుధాకర్ మరణించాడు అనే ఫేక్ న్యూస్ ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి. వీడియోలో సుధాకర్ బాగా తగ్గిపోయి, ఒకప్పటి కల పూర్తిగా పోయి కనిపించాడు. ఆడియన్స్ ని విపరీతంగా నవ్వించిన ఒక ఆర్టిస్ట్ ని అలా చూడడం ఎవరినైనా బాధించే విషయమే.
Also Read
- The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
- Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- Raviteja : 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
నాపై వస్తున్న పుకార్లను దయచేసి నమ్మకండి..అది ఫేక్ న్యూస్ : సీనియర్ సినీ నటుడు సుధాకర్#Sudhakar #Health #Tollywood #fakenews #NTVTelugu #NTVENT pic.twitter.com/MAgideO4ab
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) May 25, 2023
తాజావార్తలు
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!