Kantharao Sons: టాలీవుడ్ సీనియర్ నటుడు కట్టి కాంతారావు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సాహసమైన పాత్రలను అవలీలగా చేసిన నటుడిగా ఆయనకు మంచి పేరుంది. నిన్ననే కాంతరావు శతజయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబం గురించి తెలుసుకొనేవారందరికి పెద్ద షాక్ తగిలింది. ఆయన కుటుంబం అంతా ప్రస్తుతం దీన స్థితిలో ఉంది. కాంతారావు కు ఇద్దరు కొడుకులు.. వారిద్దరూ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంటిలో ఉంటున్నామని చెప్పుకొచ్చారు.
తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తండ్రి కాంతారావు ఉన్న ఆస్తి మొత్తాన్ని దానధర్మాలు చేసి, సొంత డబ్బుతో సినిమాలను నిర్మించి మొత్తం పోగొట్టేశారని, తమలో ఒక్కరిని కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదని వాపోయారు. కనీసం కేసీఆర్ ప్రభుత్వం తమకు సొంత ఇంటిని ఇవ్వాలంటూ కాంతారావు యొక్క కొడుకులు విజ్ఞప్తి చేస్తున్నారు. శత జయంతి ఉత్సవాలు చేయడం కంటే ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేయడం వలన ఆయన పేరు ఇంకా నిలిచి ఉంటుందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా నెటిజన్లు సైతం కోరుకుంటున్నారు.