Sekhar Master Sister in Law Died: సినీ పరిశ్రమల్లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు టెక్నీషియన్లు మృత్యువాత పడగా ఇప్పుడు తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శేఖర్ మాస్టర్ అన్న భార్య దుర్గ పది రోజుల క్రితం మృతి చెందారు. ఈరోజు ఆమె దశదిన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వదిన మృతి చెందిన విషయాన్ని తలుచుకుంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న దుర్గ పది రోజుల క్రితం కన్నుమూశారు.
KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్..
ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. మేము నిన్ను మిస్ అవుతున్నాము వదిన, ఇంత బాధని భరించి ఎంతో బలంగా నిలబడ్డావు. అలాగే నాకెంతో ధైర్యాన్ని ఇచ్చావు. ఎప్పుడూ పాజిటివ్ మైండ్ తో ఎలా ఉండాలో నువ్వే నేర్పించావు, నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు మంచి స్థానంలో ఉన్నామని ఆశిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఇక తమ పెద్దమ్మ సుమారు 11 నెలల నుంచి క్యాన్సర్ తో పోరాడుతూ ఈమధ్య మృతి చెందినట్లు శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమెను మిస్ అవుతున్నట్లుగా సాహితీ రాసుకొచ్చింది. ఒకప్పుడు బుల్లితెర షోలకు జడ్జిగా కనిపించే శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలకే పరిమితమయ్యాడు. స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోవడంతో సినిమా సాంగ్స్ మాత్రమే ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు.