Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే కదా. ఆయన సినిమాల కంటే బుల్లితెర షోలతో బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అందులో ఫోక్ డ్యాన్సర్ జానులిరిని బాగా పొగడటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు ఎక్కువగా వచ్చాయి. శేఖర్ మాస్టర్ అండతోనే ఆమె విన్నర్ అయిందంటూ రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. ‘నేను ఒక షోకు జడ్జిగా చేస్తున్నాను అంటే చాలా నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తారు డ్యాన్సర్లు. కాబట్టి అక్కడ ట్యాలెంట్ ను మాత్రమే చూడాలి. జాను అనే అమ్మాయి అందరికంటే చాలా స్పెషల్ గా డ్యాన్స్ చేసింది అనిపించింది.
Read Also : Calcutta High Court: వక్షోజాలను టచ్ చేయడం ‘‘అత్యాచారం కాదు’’, కానీ..
అందుకే ఆమెను స్టేజిపై ప్రశంసించాను. కానీ దాన్ని సోషల్ మీడియాలో ఏదేదో రాసేశారు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు క్రియేట్ చేశారు. కానీ అందులో నిజం లేదు. ఆ అమ్మాయికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. నేను ఎవరినైనా అలాగే ఎంకరేజ్ చేస్తాను. ఆమె కష్టపడి డ్యాన్స్ చేసింది కాబట్టే విన్నర్ అయింది. అందులో నేను చేసింది ఏమీ లేదు. గతంలో కూడా నాపై ఇలాంటి రూమర్లు వచ్చాయి. కానీ వాటిని నేను పట్టించుకోను. నేను డ్యాన్స్ షోలలో కేవలం ట్యాలెంట్ ను మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాను కాబట్టే నన్ను జడ్జిగా ఆహ్వానిస్తున్నారు అంతే తప్ప అందులో వేరే ఏమీ లేదు’ అంటూ చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్.