టాలీవుడ్‌లో ఎప్పటినుంచో వినిపిస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌షిప్ వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను మరింత పెంచాయి.
Also Read : AOT : ఆకాశంలో ఒక ‘తార గ్లిమ్స్’.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న’సాత్విక వీరవల్లి’ ఎవరంటే?
ఈ నేపథ్యంలో రష్మిక మందన్నాను ఈ వార్తలపై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక మాట్లాడుతూ “నిజం చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా చెబుతాను, ఇప్పుడు ఏమి చెప్పలేను’ అని తెలిపింది. రష్మిక చేసిన ఈ కామెంట్స్ పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించకపోవడం, అలాగే స్పష్టంగా అంగీకరించకపోవడంతో చాలా తెలివిగా జవాబు ఇచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఏదో కొంత నిజం ఉండొచ్చనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఎందుకనో మొదటి నుండి రష్మిక తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని భావిస్తోంది. ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని కూడా ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు ఈ జంట. ఏది ఏమైనా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటపై ఉన్న క్రేజ్ దృష్ట్యా వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అటు విజయ్ ఇటు రష్మిక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ రౌడీ జనార్ధనతో బిజీగా ఉండగా రష్మిక మైసా షూట్ ను జెట్ స్పీడ్ లో చేస్తోంది.