బాలీవుడ్‌లో లవ్ స్టోరీలు కామన్. ముఖ్యంగా డెటింగ్ అండ్ బ్రేకప్‌లు అయితే జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే తాజాగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనన్యా పాండే వార్తల్లో నిలిచారు. గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో విడిపోయిన తర్వాత, ఆమె ఇప్పుడు ఒక విదేశీ మోడల్‌తో ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు.. అమెరికాకు చెందిన మాజీ మోడల్ వాకర్ బ్లాంకో. విశేషమేమిటంటే, వాకర్ ప్రస్తుతం అనంత్ అంబానీకి చెందిన ‘వంటారా’ (జామ్‌నగర్) వైల్డ్ లైఫ్ ప్రాజెక్టులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2024లో జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుకల సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ఇప్పుడు ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
Also Read : Mamitha Baiju : మమిత బైజు కొత్త ప్రేమకథ.. షూటింగ్ డేట్ లాక్!
అనన్యా, వాకర్ మొదటిసారి అంబానీ కుటుంబం నిర్వహించిన క్రూయిజ్ పార్టీలో కలుసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ముంబైలో జరిగిన పెళ్లి వేడుకల్లో అనన్య అతడిని తన ‘పార్టనర్’ అని సన్నిహితులకు పరిచయం చేయడం, బారాత్‌లో కలిసి డ్యాన్స్ చేయడంతో వీరి రిలేషన్‌పై అనుమానాలు మొదలయ్యాయి. గత అక్టోబర్‌లో అనన్య పుట్టినరోజు సందర్భంగా వాకర్ తన ఇన్‌స్టా స్టోరీలో ‘ఐ లవ్ యు అనీ’ అని పోస్ట్ చేయడంతో ఈ బంధం దాదాపు ఖరారైనట్లైంది. అలాగే అనన్య ‘W’ (వాకర్ పేరులోని మొదటి అక్షరం) అనే పెండెంట్‌తో కనిపించడం కూడా వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేస్తోంది. మధ్యలో కార్తీక్ ఆర్యన్‌తో పుకార్లు వచ్చినప్పటికీ, ప్రస్తుతం అనన్య ఫోకస్ అంతా తన విదేశీ ప్రియుడిపైనే ఉన్నట్లు కనిపిస్తోంది.