UP: మాజీ సీఎం సోదరుడు షాకింగ్ ప్రకటన.. భార్యతో విడిపోతున్నట్లు పోస్ట్
- ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామం
- విడిపోతున్న మాజీ సీఎం సోదరుడి దంపతులు
- సోషల్ మీడియాలో కీలక పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామం జరిగింది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలోని వివాదం రచ్చ చేస్తోంది. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశాడు. తన భార్య అపర్ణ యాదవ్ నుంచి విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
వీలైనంత త్వరగా భార్యతో విడిపోవాలని అనుకుంటున్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీక్ యాదవ్ రాసుకొచ్చాడు. తన భార్య కుటుంబ సంబంధాలను నాశనం చేస్తోందని.. సొంత కీర్తి, ప్రభావాన్ని పెంచుకోవడం కోసం ప్రాకులాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన భార్య ఎప్పుడూ పట్టించుకోలేదని.. ప్రస్తుతం తాను మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇంత స్వార్థపూరిత ఆలోచనను తాను ఎప్పుడూ చూడలేదని.. వివాహం పట్ల చింతిస్తున్నట్లుగా వాపోయాడు.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
అయితే భర్త ప్రతీక్ యాదవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై భార్య అపర్ణ యాదవ్ ఇంకా స్పందించలేదు. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సస్పెన్ష్‌గా ఉంది.
ఇది కూడా చదవండి: US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం
ప్రతీక్ యాదవ్-అపర్ణ యాదవ్‌కు 2011లో వివాహం జరిగింది. వీరి వివాహం ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత హై ప్రొఫైల్ వివాహాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అనిల్ అంబానీతో సహా అనేక మంది ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. వీరికి ఒక కూతురు ఉంది.
ప్రతీక్ యాదవ్ ములాయం చిన్న కుమారుడు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు. ఇక భార్య అపర్ణ యాదవ్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. అనంతరం 2022లో ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సీఎం యోగి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంది. అటు తర్వాత ఆయోధ్య రామాలయం కోసం రూ.11లక్షలు విరాళం ఇచ్చింది. అయితే బీజేపీలో చేరిన దగ్గర నుంచి ములాయం కుటుంబంలో విభేదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. సొంత ఇమేజ్ కోసం ఆమె ప్రాకులాడినట్లుగా సమాచారం. ఈ కారణంతోనే విభేదాలు తలెత్తి విడాకుల దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

తాజావార్తలు
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!