Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’

Save The Tigers 3

Save The Tigers 3

తెలుగు ఓటీటీ రంగంలోనే వ్యూయర్‌షిప్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంబీ (AMB) సినిమాస్‌లో “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. టాలీవుడ్ స్టార్స్, క్రియేటర్ల రాకతో ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్ ఫుల్ జోష్‌గా సాగింది.

ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, బిగ్ బాస్ విన్నర్స్ వీజే సన్నీ, కళ్యాణ్ పడాలా(బిగ్ బాస్ 9)తో పాటు చైతన్య రావు, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, కిరీటి దామరాజు, ముక్కు అవినాష్, నిరుపమ్, మానస్ వంటి ఎందరో సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రీమియర్ చూసిన సెలబ్రిటీలంతా సిరీస్ లోని హిలేరియస్ కామెడీ టైమింగ్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా లీడ్ రోల్స్ పోషించిన ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డిల పెర్ఫామెన్స్‌లపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ మూడు జంటల మధ్య వచ్చే క్రేజీ సీన్స్‌తో పాటు, ఈ సీజన్‌లో సరికొత్త విలక్షణ పాత్రలో కనిపించబోతున్న వెన్నెల కిషోర్ ఎంట్రీకి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ సిరీస్, జూన్ 19 నుంచి ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కాబోతోంది.

×
×
Ad