Save The Tigers 2: సేవ్ ద టైగర్స్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Save The Tigers 2: ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం ఈ వెబ్ సిరీస్ ను క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ కు సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే సీజన్ 2 ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సిరీస్ ప్రివ్యూ వేశారు.
ఇక ఈ ఈవెంట్ లో దర్శక నిర్మాత మహీ వి రాఘవ్ మాట్లాడుతూ .. “సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ విషయంలో ముందుగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి. ముందుగానే సీజన్ 2 కూడా అనుకుని ఓకే చేయించుకున్న ఫస్ట్ సిరీస్ ఇదే అనుకుంటా. ఇలాంటి ఫన్ ఎంటర్ టైనింగ్ షోస్ లో రైటింగ్ కంటే ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ చాలా ముఖ్యం. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత వంటి యాక్టర్స్ అంతా ఈ కథని ఓన్ చేసుకుని నటించారు. మేము ఎడిటింగ్ టైమ్ లో చూసినప్పుడు, ఇప్పుడు మీ మధ్య సిరీస్ చూసినప్పుడు రెస్పాన్స్ లో వేరియేషన్ చూశాం. మన జీవితాల్లో జరిగే సరదా సందర్భాలను, క్యారెక్టర్ బేస్డ్ గా ఓ మంచి కామెడీ షో చేయాలనే ఆలోచన నుంచి సేవ్ ద టైగర్స్ మొదలైంది. సీజన్ 1 చేసిన ప్రదీప్ కు, ఇప్పుడు సీజన్ 2కు డైరెక్షన్ చేసిన అరుణ్ కు థ్యాంక్స్. ఈ సెకండ్ సీజన్ కూడా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. సేవ్ ద టైగర్స్ లో మరిన్ని సీజన్స్ చేయాలనే ఆలోచన ఉంది. నాలుగైదు సీజన్స్ తర్వాత ఇందులో బాగా వర్కవుట్ అయిన క్యారెక్టర్స్ ను తీసుకుని సినిమా కూడా చేసుకోవచ్చు” అని తెలిపాడు.
Also Read
దర్శకుడు ప్రదీప్ అద్వైతం మాట్లాడుతూ “సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన తర్వాత సెకండ్ సీజన్ కోసం హాట్ స్టార్ ను అప్రోచ్ అయ్యాం. అయితే ఫస్ట్ సీజన్ ను మరిపించేలా సెకండ్ సీజన్ చేయగలమా లేదా అనే టెన్షన్ ఆ టైమ్ లో మాలో ఉండేది. క్రియేటివ్ ఫ్రీడమ్ మొత్తం హాట్ స్టార్ వాళ్లు మాకే వదిలిపెట్టారు. మేము మా శక్తిమేరకు ప్రయత్నించి, మంచి సిరీస్ చేశామనే భావిస్తున్నాం. మీ అందరికీ సేవ్ ద టైగర్స్ 2 నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని అన్నాడు.
దర్శకుడు అరుణ్ కొత్తపల్లి మాట్లాడుతూ – “సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ సీజన్ 1 అంత పెద్ద హిట్ అయిన తర్వాత సీజన్ 2కు డైరెక్షన్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చారు. అందుకు మహీ గారికి , హాట్ స్టార్, ప్రదీప్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఫస్ట్ సీజన్ కంటే బాగా రావాలని మా టీమ్ అంతా కష్టపడ్డాం. ప్రతి సీన్ కూడా జాగ్రత్తగా తీశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ సీజన్ ను ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూశారు. ఇప్పుడు సీజన్ 2కు ఎక్స్ పెక్టేషన్స్ తో చూసినా మీకు నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.
నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ “సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ సక్సెస్ అయిన తర్వాత వెంటనే సీజన్ 2కు చర్చలు మొదలుపెట్టారు. ఇంత త్వరగా సీజన్ 2 చేస్తే రైటింగ్ కు టైమ్ ఉంటుందా అని నేను సందేహించాను. అయితే షూటింగ్ కు వెళ్లే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివాను. మా టీమ్ అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. అరుణ్ సూపర్బ్ గా డైరెక్షన్ చేశాడు. మా ప్రదీప్ బయట మాట్లాడరు. కానీ స్క్రిప్ట్ తోనే మాట్లాడుతారు. మహీ గారు పొలిటికల్ సినిమాలు చేస్తూనే సేవ్ ద టైగర్స్ వంటి మంచి సిరీస్ లు చేస్తున్నారు. ఆయన సేవ్ ద టైగర్స్ ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ అయ్యిందంటే అందుకు మీడియా ఇచ్చిన సపోర్ట్ కారణం. సెకండ్ సీజన్ కు కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నానాని అన్నాడు.
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ..” ఈ ప్రివ్యూ షోలో మీరు చూపించిన రెస్పాన్స్ కు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఇంత బాగా వచ్చిందంటే ఆ క్రెడిట్ మా రైటింగ్ టీమ్ కు ఇవ్వాలి. ప్రదీప్ అన్న, విజయ్, కార్తీక్ సూపర్బ్ స్క్రిప్ట్ ఇచ్చారు. మా డైరెక్టర్ అరుణ్ ఆ స్క్రిప్ట్, రైటర్స్ విజన్ ను సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. మహీ అన్న సీజన్ 1 నుంచి ప్రతి సందర్భంలో మాతో ట్రావెల్ చేస్తున్నారు. అటు సినిమాలు చేస్తున్నా..మమ్మల్ని గైడ్ చేసేవారు. ఒక గొప్ప సిరీస్ ను ఆయన క్రియేట్ చేశారు. వుమెన్, మెన్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ 2 చూడండి” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సిరీస్ మొదటి సీజన్ లా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!