Katha Keli Teaser Released: ఒకప్పుడు ‘ఎంత మంచివాడవురా’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు తెరకెక్కించి నేషనల్ అవార్డు సైతం అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈసారి కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కథా కేళి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా టీజర్‌ను స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ వినాయక్, హరీశ్ శంకర్, సతీశ్ వేగేశ్న చాలా మంది మా గుడి(దిల్ రాజు స్వగ్రామంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం)లో ఉన్నప్పుడు శతమానం భవతి కథ గురించి మాట్లాడుతూ టైటిల్ గురించి అడిగినప్పుడు వినాయక్, హరీశ్ చాలా బావుంటుందని అన్నారని అన్నారు. మా బ్యానర్‌లో శతమానం భవతి సినిమా జాతీయ అవార్డును గెలుచుకోగా అదే పేరుతో సతీశ్ బ్యానర్ పెట్టటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Spandana Death: పునీత్ రాజ్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మరొకరు మృతి!
హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘‘శతమానం భవతి’ అనే టైటిల్ మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్ అని, నేను డీజే షూటింగ్ చేస్తున్నప్పుడు దిల్ రాజు చిన్న పిల్లాడిలా పరిగెత్తుకొచ్చి మనం నేషనల్ అవార్డు కొట్టాం అని అంటే చాలా సంతోపడ్డాం అని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లి మన అందరినీ గర్వపడేలా చేసిన సినిమా శతమానం భవతి అని ఆయన అన్నారు. గబ్బర్ సింగ్ నుంచి డీజే, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలకు పని చేసిన సతీశ్ ఇవాళ శతమానం భవతి అనే బ్యానర్‌ను పెట్టటం చాలా సంతోషంగా ఉందని, ఈ బ్యానర్‌కు నా సపోర్ట్, కో ఆర్టినేషన్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితా పొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందించారు. ఇక ఈ టీజర్ అయితే భయపెడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.