సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” టీంకు గట్టి షాక్ తగిలింది. ప్రేమికుల రోజు కోసం స్పెషల్ గా ఓ సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కళావతి’ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఇటీవలే దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సాంగ్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాంగ్ విడుదలవ్వగానే రికార్డులు బ్రేక్ చేయాలనీ ఉత్సాహంగా ఉన్నారు. కానీ అనుకోకుండా నిన్న “సర్కారు వారి పాట” లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన చిత్రబృందంతో పాటు, అభిమానులకు కూడా తీవ్ర నిరాశను కలిగించింది. కానీ సాంగ్ బాగుండడంతో తమన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read Also : Justin Bieber : కాన్సర్ట్ లో కాల్పుల కలకలం… గాయాలు
ఇక మరోవైపు “సర్కారు వారి పాట” టీం లీక్ కారణంగా ముందుగా అనుకున్నట్టుగా ఫిబ్రవరి 14న కాకుండా ఈరోజే సాంగ్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. సిద్ శ్రీరామ్, తమన్ కాంబోలో వచ్చిన ఈ సాంగ్ ట్యూన్ ఆకట్టుకుంటోంది. “సర్కారు వారి పాట”కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.