5 విజయవంతమైన సీజన్‌లు పూర్తి చేసుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు ఓటిటి వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం అవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. అయితే అందరూ ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. 4వ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సరయు ఈ వారం హౌజ్ లో నుంచి బయటకు వెళ్లబోతోంది.
Read Also : Shah Rukh Khan : 8 ప్యాక్ తో ఇంటర్నెట్ కి మంట పెట్టేసిన కింగ్ ఖాన్
హౌజ్ లో సరయు అనేక వివాదాలకు తెర లేపింది. దాని కారణంగానే సరయుకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇతర హౌజ్ మేట్స్ తో ఆమె ప్రవర్తిస్తున్న విధానం, ఇస్తున్న స్టేట్మెంట్స్ ప్రేక్షకులను చిరాకు పెడుతున్నాయని అంటున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ ఫేస్ అయిన సరయు ఈ బిగ్ బాస్ సీజన్‌లో రెండవసారి పాల్గొంటున్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు సరయు ‘బిగ్ బాస్ సీజన్ 5’లో కూడా మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన వివాదాస్పద ప్లేయర్. మరి అందరూ అనుకుంటున్నట్టుగా సరయు ఎలిమినేట్ అవుతుందో, లేదో చూడాలి. ఇంకోవైపు ఈవారం డబుల్ ఎలిమినేషన్, వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముమైతే రీఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మరి ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.