సీనియర్ దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. కోర్ట్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ కొట్టి సక్సెస్ ను కంటిన్యూ చేస్తానని ధీమాగా ఉన్నాడు ప్రియదర్శి.
ఈ సినిమా మొదట ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని భావించగా థియేటర్స్ ఇష్యూ కారణంగా . ఈ నెల 25కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ టీమ్ నుండి ఈ సినిమాకు యు/ఏ అందుకుంది. అక్కడక్కడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు కొన్ని మ్యూట్స్ ను సూచించారట. అయితే ఫ్యామిలీస్ చూడగలిగే క్రయిమ్ కామెడీ అని కాంప్లిమెంట్ వచ్చినట్లు తెలుస్తోంది . దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ తో కలిసి చూసేలా అద్భుతంగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్ ను అందుకు తగ్గట్టే ఉన్నాయి. వేసవిలో హాయిగా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే చిత్రమని ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే సినిమా అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు ప్రమోషన్స్ లో తనదైన స్టైల్ లో చేస్తున్నాడు దర్శి.