Sanjay Dutt as Villian to Ram Charan in RC16: రామ్ చరణ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16 సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, శంకర్, సుకుమార్ సహ, అల్లు అరవింద్ వంటి వాళ్ళు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు తమకు కలిగిన అనుభూతిని రెహమాన్ సహా పలువురు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ కథ చెబుతున్నప్పుడు ఇలాంటి కథ అసలు ఎలా రాసుకున్నాడు అనే ఆశ్చర్యంతో కలిగిందని ఖచ్చితంగా థియేటర్లలో సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారని అందరూ ఏక కంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శివ రాజ్ కుమార్ కూడా దాదాపు అలాగే కామెంట్ చేశాడు. తన పాత్ర గురించి చెప్పడానికి వచ్చిన బుచ్చిబాబుకి అరగంట సమయం ఇస్తే గంటన్నర పాటు ఏమీ ఆలోచించనివ్వకుండా నేరేషన్ పూర్తి చేశాడు అని చెప్పుకొచ్చాడు.
Niharika Konidela: ఈ డాష్ లు ఏంటి.. ఆ బూతులు ఏంటి.. నిహారిక.. ?
ఇక ఇప్పుడు మరొక వార్త తెరమీద పోస్తోంది అదేమిటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కి విలన్ గా సంజయ్ దత్ నటించబోతున్నాడు. ఈ మధ్యకాలంలో సంజయ్ దత్ కేజీఎఫ్ పార్ట్ 2 లాంటి సినిమాలలో విలన్ గా నటించి నెగటివ్ పాత్రలకి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి విలన్ ఇప్పుడు రాంచరణ్ తో ఫైట్ చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని ప్రచారం అయితే ఉంది. కానీ అది ఎంతవరకు నిజమనే దాని మీద క్లారిటీ లేదు. ఇక ఇన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ పెట్టుకొని అసలు ఆర్సీ 16 సినిమాతో ఏం ప్లాన్ చేశారో అర్థం కావడం లేదని థియేటర్లు తగలబడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటూ రాంచరణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.