Sandeep Reddy : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2ను రాజమౌళి ఎంత అద్భుతంగా తీశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని ప్రతి పాత్ర.. ప్రతి సీన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమా ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ సినిమాలోని ఇంటర్వెల్ ను చూసి తాను భయపడ్డానని తెలిపాడు సందీప్ రెడ్డి. తాజాగా ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. తాను రాజమౌళి తీసిన బాహుబలి-2 ఇంటర్వెల్ చూసి భయపడ్డానని తెలిపాడు.
Read Also : Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ ఆలోచింపజేస్తుంది.. డైరెక్టర్ కరుణ కుమార్ కామెంట్స్
నేను ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో ఆ ఇంటర్వెల్ ను మించింది ఏదీ లేదు. అది చూసిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో ఇంటర్వెల్ చూసి భయమేసింది. ఎందుకంటే ఆ స్థాయి ఇంటర్వెల్ ను చూసి ప్రేక్షకులు అరుస్తున్నారు. నా సినిమా ఇంటర్వెల్ లో హీరో ప్యాంట్ లో టాయిలెట్ పోసుకుంటాడు. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని అనుకున్నా. కానీ నా కథ మీద నమ్మకంతో రిలీజ్ చేశా. అదే నన్ను ఈ స్థాయిలో నిలిపింది అంట తెలిపాడు సందీప్ రెడ్డి.