Sandeep Reddy Vanga: ఇంకో రెండు రోజుల్లో ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఈ మధ్యనే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి యూనివర్సిటీ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ కు మహేష్ బాబు, రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఎంతటి సెన్సేషన్ సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ పని అయిపోయిందని, ముంబై పాతది అయిపోయిందని.. బాలీవుడ్ హీరోలందరూ హైదరాబాద్ వచ్చేయాలని.. బాలీవూడ్ హీరోల ముందే మాట్లాడాడు. ఇక వారు అప్పుడు ఆ వ్యాఖ్యలను స్పోర్టివ్ గా తీసుకున్నా.. బాలీవుడ్ మీడియా మాత్రం మల్లారెడ్డిని ఏకిపారేసింది.
ఇక తాజాగా మాల్లారెడ్డి వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. ” మల్లారెడ్డి గారు ఇప్పుడే కాదు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు. అంతకుముందు ఆయన వేరే మీటింగ్స్ లో మాట్లాడిన మాటలను కూడా నేను విన్నాను. ఆయనకు వయసైపోయింది. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడినా పెద్దగా పట్టించుకోనవసరం లేదు.. అంతేకాకుండా ఎంత ఇబ్బంది పడినా ఏం అనలేం కూడా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.