రణబీర్ కపూర్ అనే పేరు వినగానే… కపూర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరికీ గుర్తొస్తాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్ ప్రిన్స్ అని అందరి చేత ప్రేమగా పిలిపించుకునే రణబీర్ కపూర్ ని రక్తం ముంచిలేపినట్లు ఉన్నాడు మన సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టిన సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ తో చేస్తున్న సినిమా ‘అనిమల్’. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి గతంలో కొన్ని మేకింగ్ స్టిల్స్ లీక్ అయ్యి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఆ మేకింగ్ స్టిల్స్ చూస్తేనే రణబీర్ ఏంటి ఇంత వయోలేంట్ గా ఉన్నాడు అనిపించకమానదు.
Presenting you the first look of ANIMAL. HAPPY NEW YEAR PEOPLE🙂 #RanbirKapoor #ANIMAL@AnilKapoor @thedeol @iamRashmika @tripti_dimri23 #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @Cine1Studios @TSeries @rameemusic @cowvala #ShivChanana pic.twitter.com/zrsyaXqWVx
— Sandeep Reddy Vanga (@imvangasandeep) December 31, 2022
అది జస్ట్ సాంపిల్ మాత్రమే ఒరిజినాలిటీ చూడండి అంటూ సందీప్ రెడ్డి వంగ, అనిమల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని బయటకి వదిలాడు. న్యూ ఇయర్ కానుకగా బయటకి వచ్చిన ‘అనిమల్’ పోస్టర్ షాక్ వేవ్స్ ఇచ్చే రేంజులో ఉంది. సిగరెట్ ని వెలిగిస్తూ, సంకలో గొడ్డలి పట్టుకోని ఉన్న రణబీర్ కపూర్ లుక్ చూస్తే ఇన్ని రోజులు మనం చూసిన క్యూట్ హీరో ఇంతనేనా అనే డౌట్ రావడం గ్యారెంటి. లైట్ గా విజయ్ దేవరకొండని కూడా గుర్తు చేస్తున్న రణబీర్ కపూర్ కి ‘అనిమల్’ సినిమా కెరీర్ బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసాడు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీని చూసిన కొంతమంది క్రిటిక్స్, వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ కామెంట్స్ చేశారు. లవ్ స్టొరీలో వయోలెన్స్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేశారు, అసలు నేను వయోలెన్స్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తా అంటూ ఛాలెంజ్ చేసిన సందీప్ రెడ్డి వంగ, ఆ ఛాలెంజ్ ని మర్చిపోయినట్లు లేడు. నిజంగానే క్రిటిక్స్ పైన రివెంజ్ తీర్చుకుంటున్నట్లు ‘మోస్ట్ వయోలేంట్’ సినిమాగా ‘అనిమల్’ని రూపొందించి దాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అనిమల్ ఫస్ట్ లుక్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.