ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చూసినా… అది ఆ సినిమా ఫీల్ ని తెలిపేలా ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి జరిగే విషయమే కానీ ఒక ట్రైలర్ చూస్తూనే పల్స్ రేట్ పెరగడం, ఊపిరి ఆడనట్లు అనిపించడం ఎప్పుడైనా అనిపించిందా… అనిపించలేదా అయితే ఒక్కసారి వెంటనే అనిమల్ సినిమా ట్రైలర్ చూసేయండి… క్షణం పాటు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత ఇంటెన్సిటీతో ఉంది. సందీప్ రెడ్డి వంగ ది మాస్టర్ స్టోరీ టెల్లర్… అనిమల్ ట్రైలర్ ని మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్స్ కట్ చేసాడు… నిడివి అంతే కానీ ట్రైలర్ చూస్తే మైండ్ లో నుంచి పోవడం కూడా కష్టం. టీజర్ తో శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ… ఇటీవలే అనిమల్ ట్రైలర్ చూస్తే పడుకోలేరు అంటూ ట్వీట్ చేసాడు. ఇది క్యాజువల్ మాట కాదు, అనిమల్ ట్రైలర్ చూస్తే నిజంగానే రిలాక్స్ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది.
రణబీర్ కపూర్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ లో సందీప్ రెడ్డి వంగ అచ్చుగుద్దినట్లు కనిపిస్తున్నాడు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇది పూర్తిగా డైరెక్టర్స్ ఫిల్మ్ అనే విషయం తెలిసిపోతుంది. మేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్టిస్టుల యాక్టింగ్… వాట్ నాట్ అనిమల్ ట్రైలర్ లోని ప్రతి ఎలిమెంట్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. హ్యూజ్ గన్ ఫైరింగ్ షాట్ అండ్ ట్రైలర్ ఎండ్ లో బాబీ డియోల్-రణబీర్ కపూర్ ఫైట్ సీక్వెన్స్ లు అయితే మెంటల్ ఎక్కించేలా ఉన్నాయి. ఇలాంటి ట్రైలర్ కట్ ని సందీప్ రెడ్డి వంగ మాత్రమే చెయ్యగలడు. సింపుల్ గా చెప్పాలి అంటే అనిమల్… ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఉంటే ఒక మోస్ట్ వయొలెంట్ ఫిల్మ్. ఈ సినిమా చేయబోయే విధ్వాంసం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజులో ఉండబోతుందో తెలియాలి అంటే డిసెంబర్ 1 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.